Breaking News

బైక్‌పై బయటకెళ్లిన సమంత, చైతు.. ఈ ప్రయాణం ఎక్కడికో!


ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన జంట , సమంత. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించుకున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా సమంత- నాగ చైతన్య నిలిచారు. వీరిద్దరికీ సంబంధించిన వార్తల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ జంట ఎప్పటికప్పుడు తమ ఫోటోలు ఫ్యాన్స్‌కి షేర్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తరచు తమ ఫోటోలని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత తిరిగి పోస్ట్‌లు పెడుతుంది. ఇటీవల తన భర్త చైతుతో పాటు పెట్ డాగ్‌తో కలిసి కారులో దిగిన పిక్‌ని షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సామ్ తన భర్త హీరో నాగచైతన్యతో పిలియన్‌ బైక్‌పై కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో చైతూ హెల్మెట్ ధరించగా సమంత వెనుక బ్యాగ్ వేసుకొని చేతిలో హెల్మెట్ పట్టుకొని కూర్చొంది. ఇద్దరు నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. అయితే ఈ జంట లాక్ డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకుల కోసం వీరు బయటకి వెళ్తున్నట్లు ఈ ఫోటోని బట్టి తెలుస్తుంది. సమంత, నాగచైతన్య కలిసి పలు సినిమాల్లో నటించారు. అవి మంచి హిట్ టాక్‌ను కూడా సొంతం చేసుకున్నాయి. తాజాగా మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేస్తాడని సమాచారం. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


By May 16, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-enjoys-bike-ride-with-her-husband-naga-chaitanya/articleshow/75769711.cms

No comments