Breaking News

ఇవాళ సాయంత్రం .. మియా మాల్కోవా మరో వీడియో


మియా మాల్కోవా- ఆర్జీవీ.. కాంబినేషన్‌‌లో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. క్లైమాక్స్ పేరుతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను గురువారం సాయంత్రం ఐదుగంటలకు వర్మ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. ఎడారిలో సాగే యాక్షన్, థ్రిల్లర్ సన్నివేశాలు. మియా మాల్కోవా అందాల మేళవింపుతో ఈ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా క్లైమాక్స్ టీజర్ విడుదలైన రెండు రోజులకే 1 మిలియన్ వ్యూస్ దాటింది. దీంతో వర్మ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ మరో వీడియో రిలీజ్ చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. క్లైమాక్స్ టీజర్ 1 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా మ్యూజిక్ వీడియో విడుదల చేస్తానన్నాడు. సాంగ్ నేమ్ జస్ట్ డూ ఇట్ అంటూ వర్మ పోస్టు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ న్యూడ్ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆర్జీవీకి అనేక చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. మహిళా సంఘాలు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ వర్మ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి మియాతో సినిమా తీసేందుకు ఆర్జీవీ సిద్ధమయ్యాడు. ‘క్లైమాక్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేస్తున్నాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటిస్తున్న క్లైమాక్స్ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎస్ఆర్, శ్రేయాష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లాక్ డౌన్‌లో షూట్ చేసి ఈ సినిమాను పూర్తి చేస్తామని వర్మ చెబుతున్నారు. వర్మ చేస్తున్న తాజా ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మేమంతా వెయిటింగ్ అంటూ ట్విట్టర్‌లో వర్మ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. మరి వర్మ ఈ సాంగ్‌లో ఎలాంటి అందాలు చూపిస్తాడో అని ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


By May 16, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-releasing-a-climax-teaser-promo-of-a-music-video-today-evening/articleshow/75770061.cms

No comments