ప్రేమను తిరస్కరించిందని యువతిపై కక్ష.. రూ.3లక్షల సుపారీతో మర్డర్ ప్లాన్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/75860587/photo-75860587.jpg)
తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను కాదన్న ఆమె ఈ లోకంలో ఉండకూడదన్న ఆక్రోశంతో చంపేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఏకంగా రూ.3లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆఖరి క్షణాల్లో ఈ విషయం బయటకు పొక్కడంతో సుపారీ గ్యాంగ్‌తో పాటు యువకుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. Also Read: జిల్లాలోని ఎం.నాగులాపల్లికి చెందిన సత్యదేవ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవలే తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పగా తిరస్కరించింది. అప్పటి నుంచి యువతిపై కక్ష పెంచుకున్న సత్యదేవ్ తనకు దక్కని ఆమెను ఎవరికీ దక్కకుండా చేయాలనుకున్నాడు. ఆమె చంపేందుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ వేశాడు. Also Read: ఇందుకోసం ఏలూరుకు చెందిన కొత్తపల్లి సురేశ్ గ్యాంగ్‌తో రూ.3లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.40వేలు ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ద్వారకా తిరుమల పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసలు సత్యదేవ్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By May 21, 2020 at 10:51AM
No comments