Breaking News

అమెరికాలో అల్లర్లు: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న కర్ఫ్యూ.. 1992 తర్వాత రంగంలోకి సైన్యం!


జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ పట్ల మినియాపొలీస్ సిటీకి చెందిన ఓ పోలీస్ అధికారి క్రూరంగా వ్యవహరించి అతడి చావుకు కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అమెరికాలో మెల్లగా చిచ్చు రేగుతోంది. మినియాపోలీస్‌లో ప్రారంభమైన అల్లర్లు అమెరికాలోని పలు నగరాలకు వ్యాపించాయి. రాత్రి కర్ఫ్యూను కూడా ఉల్లంఘించి ఆందోళనకారులు హింసాకాండకు పాల్పడ్డారు. డెట్రాయిట్‌లో శనివారం ఉదయం నిరసనకారుల గుంపు మీద ఓ అజ్ఞాత వ్యక్తి జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ళ యువకుడు మరణించాడు. హింసాత్మక ఘటనలతో పరిస్థితి అదుపుతప్పుతుండటంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. Read Also: మినియాపొలీస్‌కి నార్త్ కరొలినా, న్యూయార్క్‌ నుంచి సైనికులను తరలించారు. 1992లో రోడ్నే కింగ్‌ అనే నల్లజాతీయుడిని పోలీసులు పావు గంట సేపు అదేపనిగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోగా అల్లర్లు చెలరేగడంతో వాటిని అణచివేసేందుకు నాటి అధ్యక్షుడు తన అధికారాల మేరకు సైన్యాన్ని రంగంలోకి దించాడు. ఇన్నేళ్ల తరువాత ట్రంప్ కూడా ఇదే పని చేశారు. అమెరికాలోని ఒకహోమా రాష్ట్రంలోని తుల్సాలో 1921లో నల్లజాతీయులపై ఊచకోతకు పాల్పడి 300 మందిని పొట్టనబెట్టుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. Read Also: ఇలా ఉండగా అమెరికాలో న్యూయార్క్, బ్రూక్లిన్, కెంటకీ, టెక్సాస్, అట్లాంటా, జార్జియా, మిచిగాన్, పోర్ట్ ల్యాండ్ వంటి నగరాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మాస్క్‌లు లేకుండా, సామాజిక దూరం నిబంధనలను గాలికొదిలేశారు. కాలిఫోర్నియాలో బ్యాంకు, పోర్ట్ ల్యాండ్‌లో పోలీసు వాహనాలకు, ఇంకా పలు చోట్ల షాపులు, ఇతర భవనాలకు నిప్పు పెట్టారు. వీరిని అదుపు చేసేందుకు వైట్ హౌస్ తాత్కాలికంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ ఘటనల్లో ఇరు వర్గాలు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఫిల్‌డెల్ఫియాలో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారి 13 మంది అధికారులు గాయపడ్డారు. పోలీసులకు చెందిన నాలుగు వాహనాలకు నిప్పంటించారు. లాస్ ఏంజిల్స్‌లో నిరసనకారులు ‘బ్లాక్ లైవ్స్ మేటర్’అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. Read Also: మినియాపోలిస్‌లో సోమవారం నాడు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతీయుడిని దొంగతనం నేరం కింద అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్జ్‌తో పాటు అక్కడున్న మిగతా వాళ్లు కూడా పోలీసును అలా చేయొద్దని వారించడం అందులో కనిపించింది.‘ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు’ అంటూ జార్జ్ మొరపెట్టుకున్నా పోలీసు వినిపించుకోలేదు. Read Also: జార్జ్‌కు అవే ఆఖరి మాటలయ్యాయి. దీంతో ఊపిరాడక అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోలీసుల వైఖరిపై ప్రజలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ''నల్లవాడిగా పుట్టడం మరణశిక్షకు అర్హత కాదు'' అని నగర మేయర్‌ వ్యాఖ్యానించారు. మేయర్‌ వ్యాఖ్యల తర్వాత ఆందోళకారులు మరింత రెచ్చిపోయారు. పలు షాపులను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పుపెట్టారు.


By May 31, 2020 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/unrest-continue-in-us-cities-after-minneapolis-police-killings-of-black-men-george-floyd/articleshow/76117068.cms

No comments