Breaking News

‘నాన్నను చంపింది అమ్మ, అంకులే’.. 12ఏళ్ల బాలుడి సాక్ష్యంతో వీడిన మిస్టరీ


హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం చనిపోయిన ఆటోడ్రైవర్ నాగభూషణం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అతడి భార్య జయమేరీ అందరినీ నమ్మించింది. అయితే అనూహ్యంగా నాగభూషణం గుండెపోటుతో చనిపోలేదని, భార్య జయమేరీ ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మృతుడి 12ఏళ్ల పెద్దకొడుకే ఈ దారుణ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. అతడి వాంగ్మూలంతో పోలీసులు జయమేరీ, ఆమె ప్రియుడు రాజేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న నాగభూషణం(36) లాలాపేట పరిధిలోని వినోబానగర్‌లో భార్య జయమేరీ, ఇద్దరు కొడుకులతో కలిసి నివసిస్తున్నాడు. జయమేరీకి ఆరు నెలల క్రితం లాలాపేట శాంతినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ రాజేశ్‌(38)తో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. మేరీ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు కొనసాగించేంది. రాజేశ్ తరుచూ ఇంటికి వచ్చిపోతుండటాన్ని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని నాగభూషణానికి చెప్పడంతో తరుచూ భార్యతో గొడవపడేవాడు. తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని మేరీ ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. Also Read: శనివారం( మే 16) రాత్రి నాగభూషణం నిద్రపోతున్న సమయంలో జయమేరీ ప్రియుడిని రప్పించింది. ఇద్దరూ కలిసి నాగభూషణం మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత మేరీ కొత్త నాటకానికి తెరదీసింది. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. బంధువుల సమక్షంలోనే ఆదివారం లాలాపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మేరీ ఎందుకు చెప్పిందోనని బంధువులకు అనుమానం వచ్చింది. నాగభూషణం పెద్ద కొడుకును కొందరు బంధువులు పక్కకు తీసుకెళ్లి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నాన్నను అమ్మ, రాజేష్ అంకుల్ కలిసి చంపుతుండగా తాను చూశానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని తనను కూడా బెదిరించారని ఆ బాలుడు చెప్పాడు. దీంతో నాగభూషణం మేనల్లుడు హరికృష్ణ ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు జయమేరీ, రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. ఆటోడ్రైవర్ అయిన రాజేశ్ గతంలో పలు చోరీల కేసుల్లో జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:


By May 20, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-paramour-help-in-hyderabad-accused-arrested/articleshow/75838925.cms

No comments