Breaking News

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు దుర్మరణం


ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎటవా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు. రైతులు పండ్లను విక్రయించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పండ్లను విక్రయించడానికి రైతులు ట్రక్కులో వస్తుండగా.. ఎటవా ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఎదురెదుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ఎటవా జిల్లా ఎస్పీ ఆర్ సింగ్ తెలిపారు. తమ తోటలో పండిన పనస పండ్లను అమ్మడానికి రైతులు వెళ్తుండగా దుర్ఘటన జరిగిందన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సఫాయి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్పించినట్టు తెలిపారు. ప్రమాదం గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎదురెదురుగా వాహనాలు ఢీకొట్టడంతో ఒకదానికి ఒకటి అతుక్కుపోయి.. అందులో మృతదేహాలు చిక్కుకున్నాయి. అతికష్టంతో మృతదేహాలను బయటకు తీశారు. క్రేన్ సాయంతో వాహనాలను వేరుచేసి, అందులోని వారిని బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుని వైద్యం కోసం తరలించామని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసుల వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు.


By May 20, 2020 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-farmers-dies-in-road-accident-truck-collided-with-another-truck-in-uttar-pradesh/articleshow/75839376.cms

No comments