RRRలో మరో స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటినుంచే జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. వాళ్ళ అంచనాలకు ధీటుగా ఈ పీరియాడికల్ మూవీని కెమెరాలో బంధిస్తున్నారు జక్కన్న. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నారని, అది కూడా ఎన్టీఆర్ బాబాయ్ పాత్ర పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఎన్టీఆర్ బాబాయ్ రోల్ మోహన్ లాల్ పోషిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పి ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటోంది. తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతుండటం మెగా, నందమూరి అభిమానుల్లో ఆత్రుత రేపుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేస్తూ టైటిల్ సీక్రెట్ చెప్పారు జక్కన్న. RRR అంటే 'రౌద్రం రణం రుధిరం' అని తెలిపి ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2021 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలనేది జక్కన్న స్కెచ్. అయితే తాజా పరిస్థితులు, కరోనా ప్రభావం చూస్తుంటే ఆ డేట్‌కి RRR విడుదల కావడం కష్టమే అనిపిస్తోంది. Also Read:
By April 21, 2020 at 10:56AM
No comments