Breaking News

ఎన్టీఆర్.. చీపురుపట్టి, గిన్నెలు క్లీన్ చేసి ఆ నలుగుర్ని నామినేట్ చేస్తూ వీడియో


‘బీ ది రియల్ మ్యాన్’ టాలీవుడ్‌లో నడుస్తున్న ఈ కొత్త ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవుతూ.. మరింత ఊపునిచ్చే వీడియోను విడుదల చేశారు యంగ్ టైగర్ . లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఇంట్లో ఉన్న భర్తలు.. తమ భార్యలకు సాయం చేయాలని అతనే రియల్ మ్యాన్ అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘బీ ది రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్‌ను ప్రారంభించి దర్శకుడు రాజమౌళిని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ, డోర్స్ క్లీన్ చేసిన వీడియోను సోషల్ మీడియాల షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటుగా.. సుకుమార్, కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఛాలెంజ్ విసిరారు. కాగా సోమవారం నాడు 'ఛాలెంజ్ సీకరిస్తున్నా జక్కన్న' అంటూ రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్.. నేడు అదిరిపోయే వీడియో విడుదల చేశారు. Read Also: చీపురు పట్టి ఇల్లు క్లీన్ చేస్తూ, వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. ఈ వీడియోతో పాటు ‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’.. అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ.. ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌కి తన బాబాయ్ బాలయ్య, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కొరటాల శివలను నామినేట్ చేశారు. మరి వీళ్లంతా ఎప్పుడు చీపురు పడతారో.. లేక వంటగదిలో గరిట పడతారో చూడాలి.


By April 21, 2020 at 10:48AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ntr-takes-be-the-real-man-challenge-nominates-balakrishna-chiranjeevi-venkatesh-and-koratala/articleshow/75265003.cms

No comments