Rishi Kapoor Death: రిషి కపూర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) ఆకస్మిక మరణవార్త యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. దేవుడా.. మీరు ఏం చేస్తున్నారు? భారతీయ సినిమా పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. రిషి కపూర్ మరణించారనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. భారత దేశమంతా అన్ని జెనెరేషన్స్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న గొప్పనటుడు ఆయన. రిషి కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా- అనసూయ భరద్వాజ్. నా ప్రియ మిత్రుడు రిషి కపూర్ మరణించారని తెలిసి గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా- రజినీకాంత్. ఏదో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా మనస్సు, చేతులు సహకరించడంలేదు. రిషికపూర్ లేరనే విషయాన్ని నా హృదయం అర్థం చేసుకోలేకపోతుంది. ఆ నవ్వు, ఆ హాస్యం, నిజాయితీ అన్నీ కోల్పోయాం. మీలాంటి మనిషి ఇంకెవరూ లేరు- తాప్సి రిషి కపూర్ లేరంటే నమ్మలేక పోతున్నా. రిషి గారు మరణించారనే షాకింగ్ న్యూస్ వింటూ నిద్రలేచా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మిమ్మల్ని మిస్ అయ్యాం రిషి కపూర్ గారు- తమన్నా 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్‌గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించారు రిషి కపూర్.
By April 30, 2020 at 10:52AM
No comments