Breaking News

వచ్చే ఎన్నికల్లో నా ఓటమికి చైనా ఎంతకైనా తెగిస్తుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


నవంబరులో జరగబోయే ఎన్నికల్లో తనను తిరిగి గెలవకుండా చైనా ఏమైనా చేయగలదని, దీనికి నవంబరులో వెలుగుచూసిన కరోనా వైరస్‌ విషయంలో వ్యవహరించిన తీరే సాక్ష్యమని అమెరికా అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. బుధవారం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ విషయంలో చైనా నుంచి భారీగానే నష్టపరిహారం పొందే విషయంపై దృష్టి సారిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ దర్యాప్తు చాలా సీరియస్‌గా జరుగుతోందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాను బాధ్యురాలిగా చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. చైనా విషయంలో తాము సంతృప్తిగా లేం’ అని వ్యాఖ్యానించారు. జర్మనీ నష్టపరిహారం కింద 130 బిలియన్ల యూరోలు కోరుతోందన్న విషయం ఆయన దృష్టికి తీసుకురాగా తాము అంత కంటే ఎక్కువ పరిహారాన్ని రాబట్టడంపై యోచిస్తున్నామని సమాధానమిచ్చారు. ప్రపంచ అంటువ్యాధికి చైనా మూలమని, దీని వల్ల అమెరికాలో కనీసం 60వేల మంది ప్రాణాలు కోల్పోయారని, తమ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. వైరస్ వ్యాప్తి గురించి తమను ముందుగానే హెచ్చరించలేదని ఆరోపించారు. గురించి ప్రపంచానికి తెలియజేయడానికి చైనా మరింత వేగంగా స్పందించాల్సిందని తాము నమ్ముతున్నానని అన్నారు. ఎన్నికల్లో తన ఓటమికి వారు చేయాల్సిందంతా చేస్తారని, డెమెక్రాటిక్స్ అభ్యర్థి జోయ్ బైడెన్‌ గెలవాలని వారు కోరుకుంటున్నట్టు బలంగా నమ్ముతున్నానని అన్నారు. బైడెన్ విజయం సాధిస్తే ట్రంప్ వల్ల ఎదురైన వాణిజ్యం సహా వివిధ అంశాలలో వత్తిడి నుంచి బయటపడతామని చైనా భావిస్తోందన్నారు. తెలివితక్కువ పార్టీల మాదిరిగా నిరంతరం ప్రజా సంబంధాలను ఉపయోగిస్తున్నారని చైనా అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలిక లోటులను తగ్గించే లక్ష్యంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం అమలు నుంచి వైరస్ వ్యాప్తిని సాకుగా చూపి చైనా వైదొలగే ప్రయత్నాలు చేయడం చాలా దురదృష్టకరమని ట్రంప్ అన్నారు. దీనిపై అమెరికా పాలనా యంత్రాంగంలోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ. మార్చి చివరి వారంలో ట్రంప్, జీజిన్‌పింగ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహనకు వచ్చారని, అయితే అది ఇప్పుడు ముగిసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనావైరస్‌పై పోరులో సహకరించడానికి తమ ప్రభుత్వాలు సాధ్యమైనంత మేర పనిచేస్తాయని ఇరువురు నాయకులు హామీ ఇచ్చారు. అయితే, ఇటీవలి అమెరికా, చైనాలు వైరస్ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ విషయంలో అదే పనిగా ట్రంప్‌ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చైనా వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్ ఆయన సహచరులు మరింత ఉద్ధృతం చేశారు.


By April 30, 2020 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-says-china-wants-him-to-lose-his-bid-for-re-election/articleshow/75464491.cms

No comments