Breaking News

చెడ్డీతో అనసూయ డాన్స్ వైరల్.. ఫ్యాంట్ వేసుకోమంటూ నెటిజన్స్ ట్రోల్స్


అంతే.. వాళ్లకు తిట్టడం ఇష్టం, ఈమెకు వాళ్లను మరింత రెచ్చగొట్టటం ఇష్టం. యాంకర్ వస్త్రధారణ విషయంలో తరచూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తూ ఉంటుంది. ఆమె పొట్టిపొట్టి బట్టలు వేసుకుని కవ్విస్తూ అందాలను ఆరబోస్తుంటే.. కాస్తైనా ఉండక్కర్లే.. ఇద్దరు బిడ్డలు తల్లివి ఇలాగేనే ఉండేది? ఇదేనా మన సంస్కృతి.. ఇలా విప్పుకుంటూ పోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఉంటారు. మామూలుగా ఓ మోస్తరు బట్టలు వేసుకున్నా.. ఆమెను ఏకిపారేస్తుంటారు నెటిజన్లు. ఇక అసలు మీరెవరూ.. నాకు బట్టలు గురించి మాట్లాడటానికి..? చూపించే నాకు కాదు.. చూసే మీకు సిగ్గు ఉండాలి? మీలో ఆ కామపు చూపుని ముందు చంపేయాలి.. ముందు మీ ఆలోచన మార్చుకోండి. నా భర్తకు పిల్లలకు లేని అభ్యంతరం మీకు ఎందుకు?? ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లను ఏం చేసిన పాపం లేదు అంటూ ట్రోలర్స్ గట్టి కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది అనసూయ. ఇక అనసూయ వర్సెస్ ట్రోలర్స్ ఇష్యూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ట్రోలర్స్‌కి మరింత పని కల్పించే వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది అనసూయ. బుల్లి చెడ్డీ, పైన టీ షర్ట్‌తో వంటగదిలో వీరలెవల్లో డాన్స్ చేస్తూ ఊగిపోతూ వీడియో వదిలింది. వరల్డ్ డాన్స్ డే సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది అనసూయ. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక క్వారంటైన్‌లోనూ కిచెన్‌లోనే గడిపేస్తూ అదే పొట్టి చెడ్డీతో వంట చేస్తూ వీడియోలు వదులుతుండటంతో.. ‘ఛీ ఛీ ఇదేంది అనసూయా!! కాస్తైనా పద్దతీ పాడూ లేకుండా ఇలాంటి బట్టలతోనే డాన్స్ చేసేది?? నా భర్తకు పిల్లలకు అభ్యంతరం లేదు మీకెందుకు అనీ మళ్లీ విరుచుకు పడుతుంటావ్.. కాని!! ఇంట్లో ఉన్న యవ్వారాన్ని తీసుకుని వచ్చి ఇలా ఆన్ లైన్‌లో పెట్టుకోవడం మర్యాదా? అంటూ ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. డాన్స్ చేస్తే చేశావ్. కింద ఫ్యాంట్ వేసుకోవచ్చు కదా మేడమ్ అని సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు.


By April 30, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-bharadwajs-international-dance-day-video-goes-viral-in-social-media/articleshow/75465170.cms

No comments