ఇవాళ తనకెంతో స్పెషల్ డే అంటున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా అమ్మాయిలు మహేష్ అంటే పడి చచ్చిపోతారు. చాక్లెట్ బాయ్ లా క్యూట్‌గా కనిపించే మహేష్‌కు అమ్మాయిల మనసుల్లో ప్రత్యేక స్థానం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫ్యామిలీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ అన్నింటిని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. ఇవాళ (ఏప్రిల్ 20) తనకెంతో స్పెషల్ డే అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఈరోజున అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ? సూపర్ స్టార్ తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు ఇవాళే. ఈ సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ మెసేజ్‌ను పెట్టాడు. తన తల్లితో కలిసి దిగి మనసారా నవ్వుతున్న ఫోటోను కూడా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ``ఏప్రిల్ 20 నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మా అమ్మపుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే అమ్మా'' అంటూ ఇందిరా దేవి, మహేష్ బాబు కలిసున్న ఫొటోను షేర్ చేశారు. మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలోనూ తండ్రి కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు సోదరుడు, సోదరీమణులు కనిపిస్తారు కానీ.. తల్లి ఇందిర మాత్రం ఎక్కడా కనిపించరు. కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం జరిగిపోయింది. ఇందిరాదేవి కృష్ణకు స్వయానా మరదలు అవుతుంది. సొంత మరదలినే కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు. అయితే విజయనిర్మలతో వివాహం తర్వాత కూడా మొదటి భార్యను కృష్ణగారు ఎలాంటి లోటూ లేకుండా చూసుకున్నారు. గొడవలకు దిగితే ఎక్కడ తమ పరువు పోతుందోనని ఇందిరా దేవి భావించేవారంట. అందుకే ఆమె ఎప్పుడూ ఎక్కడా హడావుడి చేయరు.
By April 20, 2020 at 10:21AM
No comments