Breaking News

వామ్మో లేడీస్... పీకల దాాకా తాగేసి పోలీసులపైనే చిందులు


లాక్‌డౌన్ సమయంలో బయట తిరగొద్దని పోలీసులు ఎంతజెప్పినా కొందరు చెవికెక్కించుకోవడం లేదు. ఎవరేం చేసుకుంటారో చేసుకోని.. మా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. తాజాగా రాజధాని బెంగళూరులో కొందరు యువతులు రాత్రివేళ పీకల దాకా మద్యం సేవించి నడిరోడ్డుపై హల్‌చల్ చేశారు. అడ్డుకున్న పోలీసులపైనే దౌర్జన్యానికి యత్నించారు. Also Read: లాక్‌డౌన్ కారణంగా బెంగళూరులో పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. శనివారం రాత్రి నలుగురు యువతులు కారులో వెళ్తుండగా లీలా ప్యాలెస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమ వద్ద పాస్‌ ఉందని, ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు వాదనకు దిగారు. వారంతా మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని బయటకు దించి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించేందుకు యత్నించగా వారు రెచ్చిపోయారు. Also Read: మమ్మల్నే పరీక్షిస్తారా? అంటూ పోలీసులు దుర్భాషలాడారు. తమ కారును పోలీస్ జీపు పైకి దూకించే యత్నం చేశారు. అనంతరం వేగంగా కారును పోనిచ్చారు. దీంతో పోలీసులు బైక్‌పై వారిని కిలోమీటరు మేర వెంబడించినా ఫలితం లేకపోయింది. చేసేదేమీ లేక కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న తమకు ఇలాంటి వారి కారణంగా తలనొప్పులు తప్పడం లేదని పోలీసులు వాపోతున్నారు. Also Read:


By April 20, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/women-caught-redhandedly-by-police-while-drunk-and-drive-in-bengaluru/articleshow/75243537.cms

No comments