Breaking News

తల్లితో కలిసి అత్తను హతమార్చిన కోడలు.. ఏడాది తర్వాత వెలుగులోకి


తనను నిత్యం వేధిస్తున్న అత్తపై కక్ష పెంచుకున్న కోడలు తల్లితో కలిసి కిరాతకంగా చంపేసింది. గతేడాది మే 3న జిల్లా రాజంపేటలో జరిగిన హత్యకేసును 11 నెలల తర్వాత పోలసులు చేధించారు. వివరాల్లోకి వెళితే... గతేడాది మే 3న పట్టణం ఎర్రబల్లికి చెందిన సుమిత్రమ్మ(55) అనే మహిళ హత్యకు గురైంది. పట్టణంలో సంచలనం రేపిన ఈ ఘటనపై ఆమె కుమారుడు మహీధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి 11 నెలల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు. Also Read: పోలీసుల కథనం ప్రకారం... సుమిత్రమ్మ తన కోడలు శ్వేతను చాలాసార్లు వేధించింది. దీంతో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్వేత తన బాధను తల్లి ఇందిరమ్మకు చెప్పడంతో సుమిత్రమ్మను చంపేయాలని పథకం వేశారు. కిరాయి హంతకులు అనంతపురం జిల్లా పశ్చిమ నడిమిపల్లిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన ఓర్సు నాగరాజు, కొండ్లవాల్లపల్లికి చెందిన మల్లెల రమేష్‌‌, మల్లికార్జున సాయంతో ఇందిరమ్మ మే 3న ఆమెను దారుణంగా చంపేసింది. Also Read: ఈ కేసులో తొలుత ఎలాంటి క్లూ లభించకపోవడంతో దర్యాప్తుకు అడ్డంకి ఏర్పడింది. మరింత లోతుగా విచారణ జరపడంతో చివరికి కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఇందిరమ్మ, ఆమె కుమార్తె శ్వేతతో పాటు నాగరాజు, మల్లికార్జున, ఎం.రమేష్‌ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 62 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By April 10, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-mother-in-law-in-rajampet-over-harassment/articleshow/75076556.cms

No comments