Breaking News

ఇద్దరు కొడుకులను తుపాకీ కాల్చి... తండ్రి ఆత్మహత్య


మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి క్షణికావేశంలో ఇద్దరు కొడుకులపై తుపాకీలో కాల్పులు జరిపాడు. అనంతరం మనస్తాపానికి గురై అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రపూర్‌ జిల్లా బల్లాపూర్ పట్టణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. Also Read: బల్లాపూర్‌ పట్టణానికి చెందిన మూల్‌చంద్ ద్వివేది(50) భార్య, ఇద్దరు కొడుకులు ఆకాశ్(22), పవన్(20)తో కలిసి జీవిస్తున్నాడు. అతడికి లైసెన్స్‌డ్ తుపాకీ ఉంది. మంగళవారం కుటుంబంలో చిన్నపాటి గొడవ మొదలై ఘర్షణగా మారింది. దీంతో ఆకాశ్, పవన్ తండ్రిపై ఎదురు తిరిగారు. దీంతో కోపోద్రిక్తుడైన మూల్‌చంద్ తన తుపాకీతో ఇద్దరు కొడుకులను విచక్షణా రహితంగా కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: తుపాకీ శబ్ధాలు విని అక్కడికి చేరుకున్న స్థానికులకు తండ్రీ కొడుకులు రక్తపు మడుగులో కనిపించారు. మూల్‌చంద్ అప్పటికే ప్రాణాలు కోల్పోగా.. ఆకాశ్, పవన్ కొనప్రాణాలతో కనిపించాడు. దీంతో వారిద్దరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో ఆకాశ్ ప్రాణాలు కోల్పోయాడు. పవన్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. క్షణికావేశంలో మూల్‌చంద్ చేసిన పనివల్ల ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. Also Read:


By April 30, 2020 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maharastra-man-fired-gun-on-two-sons-before-his-suicide/articleshow/75464037.cms

No comments