Breaking News

కరోనాపై కొత్త సినిమా.... ఫస్ట్ లుక్ విడుదల


కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి అది తప్పా వేరే వార్త లేకుండా పోయింది. మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సైతం మరో 19 రోజుల పాటు ప్రకటిస్తూ కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు, అధికారులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనాపై అవగాహన కల్పిస్తూ పాటలు, షూట్లు చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ తారలు ఇదే పనిలో ఉన్నారు. తాజాగా కరోనాపై కోలీవుడ్‌లో ఓ సినిమా తెరక్కెనుంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ కూడా పేట్టేశారు. ‘21డేస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లాక్‌డౌన్‌ రోజుల్లో జరిగిన విషయాల ఇతివృత్తంగా దీన్ని రూపొందించనున్నారు. ఎంబీఆర్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై ఎం విజయ్‌ భాస్కర్‌ నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకత్వం కూడా వహించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఆన్‌లైన్‌ ద్వారా నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వైరస్‌కు సంబంధించిన సినిమా ఒకటి వచ్చింది. తమిళంలో ప్రముఖ నటుడు సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ అనే సినిమాలో కూడా భయంకరమైన వైరస్ గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ సినిమాలో కూడా వైరస్‌ చైనాలోనే పుడుతుంది. సూర్య తొలిసారిగా హిస్టారికల్‌ మెడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌‌గా సెవెన్త్ సెన్స్‌లో నటించారు. అప్పట్లో ఈ సినిమాకు మురుగుదాస్ దర్శకత్వం వహించారు.


By April 16, 2020 at 08:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kollywood-movie-on-corona-virus-title-fix-as-21-days/articleshow/75172691.cms

No comments