Breaking News

అప్పు తీర్చలేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి.. భద్రాద్రి జిల్లాలో దా‘రుణం’


వడ్డీ డబ్బులు చెల్లించలేదన్న కోపంతో ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. రుణగ్రహీత, అతడి భార్యను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం సులానగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అదే గ్రామానికి చెందిన బానోత్‌ హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద గతంలో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. వీటిలో రూ.1.50 లక్షలు ఇటీవలే చెల్లించాడు. Also Read: లాక్‌డౌన్‌ కారణంగా మిగిలిన అసలు, వడ్డీ చెల్లించేందుకు వడ్డీ వ్యాపారిని అజ్మీరా గడువు కోరాడు. దీనికి ఒప్పుకోని వ్యాపారి తన అప్పు మొత్తం తీర్చేయాలంటూ అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం హన్మా కోపంతో హట్యా ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశాడు. అడ్డుపడిన హట్యా భార్యను తన ఇంటికి లాక్కెళ్లి నిర్బంధించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 16, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lender-kidnapped-borrowers-wife-in-bhadradri-kothagudem-district/articleshow/75172123.cms

No comments