Breaking News

పక్కింటి ఆంటీతో అఫైర్ .. యువకుడిపై మహిళ భర్త హత్యాయత్నం


వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి పక్కింట్లో ఉండే యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరులో మంగళవారం జరిగింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రెండు నెలలుగా జె.కొత్తూరుకు వలస వచ్చాడు. అక్కడే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి ఇంటికి ఎదుటే గల్లా ఉమామహేశ్(20) అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. Also Read: తన భార్య ఆ యువకుడితో మాట్లాడటం ఆ వ్యక్తి అనేకసార్లు చూశాడు. దీంతో ఉమామహేశ్‌ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం తన భార్యతో ఆ యువకుడు మాట్లాడటం చూసిన ఆ వ్యక్తి కోపోద్రిక్తుడయ్యాడు. కత్తితో మహేశ్‌పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. కేకలు వేసుకుంటూ పరుగు పెడుతున్న బాధితుడిని చూసిన స్థానికులు అతడిని కాపాడి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగ్గంపేట పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. Also Read:


By April 15, 2020 at 09:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-stabs-neighbour-in-east-godavari-district-over-illegal-affair/articleshow/75150894.cms

No comments