Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: ప్రయాణికులకు విమానయాన సంస్థలు షాక్


కంటికి కనిపించని మహమ్మారి కరోనాతో ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. చైనాలో మొదలైన .. ప్రస్తుతం ప్రపంచ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ మహమ్మారి అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య తాజాగా 20 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 1.26 లక్షలు దాటింది. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికాలో వైరస్‌ వ్యాప్తి కొంత తెరిపినిచ్చింది. ఇదే సమయంలో రష్యాలో దీని వేగం పుంజుకుంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయానికి 10వేలు దాటగా.. గడచిన 24 గంటల్లో 1,400కుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో వైరస్ వెలుగుచూసిన తర్వాత రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మార్చి 24న తొలి విడత దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రారంభమైన రోజుకు 600గా ఉన్న కేసులు.. ఇది ముగిసేనాటికి 11వేలకు చేరుకుంది. ఆయన నెల్లూరులో పేరున్న గొప్ప డాక్టర్.. తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి ఉంటాడు.. సొంత ఆస్పత్రి.. పెద్ద కుటుంబం.. కావల్సినంత ఆస్తి. కానీ అవన్నీ దేనికీ పనికిరాలేదు.. చివరికి అనాథ శవంగా మిగిలిపోయిన దారుణమైన పరిస్థితి. కరోనా మహమ్మారి సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితాన్ని.. కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ మరో 19 రోజులు(మే 3 వరకు) పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 21రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు లాక్‌డౌన్‌ను మోదీ సడలిస్తారేమోనని ఆశగా చూసినా ఫలితం లేకపోయింది. ఆయన ప్రకటనతో కార్మికులు, చిన్న పరిశ్రమల వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఏపీలో ఈ-పాస్‌లకు దరఖాస్తుల వెల్లువ వచ్చిపడింది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకాగా.. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల దరఖాస్తులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు.. అత్యవసరమైన వారు సొంత ఊళ్లకు వెళ్లాలంటే పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఉత్త‌రాది రాష్ట్రం రాజస్థాన్‌ను వ‌ణికిస్తోంది. మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం రాజ‌స్థాన్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు 1005కి చేరాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 108 కొత్త పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌హారాష్ట్ర , ఢిల్లీ, త‌మిళ‌నాడు త‌ర్వాత‌ పాజిటివ్ కేసులు వెయ్యి మార్కును దాటిన రాష్ట్రంగా నిలిచింది. లాక్‌డౌన్ కొన‌సాగింపు కార‌ణంగా ఆందోళ‌న‌కు దిగిన వ‌లస కూలీల‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక్రే భ‌రోసానిచ్చారు. మ‌హారాష్ట్రలో అంద‌రూ క్షేమంగా ఉంటార‌ని, లాక్‌డౌన్ ఎత్తివేశాక, సొంత ఊళ్లకు వెళ్ల‌వ‌చ్చ‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ఈనెల 14 నుంచి వ‌చ్చేనెల 3 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మంగళవారం మరింతగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్తగా 52 మందికి సోకినట్లుగా మంగళవారం ఒక్కరోజే గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 644కి చేరింది. మంగళవారం రాత్రి 52 మందికి కొత్తగా కరోనా సోకినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గుజరాత్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇమ్రాన్ ఖేడావాలాకు కోవిడ్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఆయన అహ్మదాబాద్‌లోని జమల్‌పూర్-ఖడియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడానికి ఆరు గంటల ముందే ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి.. సీఎం విజయ్ రూపానీని గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో కలిశారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో 20 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చికిత్స అనంతరం కోలుకున్న ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య త్వరలోనే మిగతా వారు కూడా కోలుకునే అవకాశం ఉంది. అంతేగాక ఇక్కడ కరోనా మరణాలేవీ చోటు చేసుకోలేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీకి పొడిగించడంతో, ఆ తేదీ వరకు చేసుకున్న ప్రయాణాల బుకింగ్‌లను రద్దు చేసే పనిలో విమానయాన సంస్థలు ఉన్నాయి. టికెట్లను రద్దు చేసినా, డబ్బులు మాత్రం నగదు రూపేణా తిరిగి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఆ డబ్బులను తమ వద్దే (క్రెడిట్‌ షెల్‌) అట్టేపెట్టుకుంటామని, తదుపరి ప్రయాణాలకు బుకింగ్‌ చేసుకునేటప్పుడు దానిని ప్రయాణికులు వాడుకోవచ్చని చెబుతున్నాయి. పూర్తి కథనం.. ⍟ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.


By April 15, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-deaths-updates-in-ap-and-telangana-india-state-wise-live-updates-in-telugu/articleshow/75151454.cms

No comments