జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో భద్రత బలగాలు ఎన్ కౌంటర్ నిర్వహించారు. పుల్వామా జిల్లాలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరితో పాటు... వారికి సహకరిస్తున్న మరో వ్యక్తిని కూడా మట్టుపెట్టారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అవంతిపొరలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. తెల్లవారుజామున ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఇదే సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు, వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమయ్యారని పేర్కొన్నారు. ఇంకా అక్కడ గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
By April 25, 2020 at 09:33AM
No comments