Breaking News

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వృద్ధి రేటు 8గా కొనసాగితే వచ్చే వారాంతానికి 40వేల కేసులు


నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూనే పూర్తిగా ప్రగతి రథం నిలిచిపోకుండా కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా మినహాయింపులను ఇస్తోంది. వైరస్‌ను కట్టిడి చేస్తూ ఏప్రిల్ 20 నుంచి ఆర్ధిక కార్యకలాపాలను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో మరికొన్నింటికి కేంద్రం శుక్రవారం అనుమతించింది. మున్సిపాల్టీల వెలుపల, సమీపంలో ఉన్న రెసిడెన్షియల్, మార్కెట్ కాంప్లెక్స్‌ల్లో వ్యాపార కార్యకలాపాల ప్రారంభానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి స్వైరవిహారం కొనసాగుతోంది. ఈ రాకాసి కోరల్లో చిక్కుకుని దాదాపు అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతోంది. దీనికి అంతం ఎక్కడో తెలియక సతమతమవుతున్నారు. అమెరికాలో రెండు రోజుల కిందట కాస్త తగ్గినట్లే కనిపించిన మళ్లీ ఉద్ధృతి పెరిగింది. గడచిన 24 గంటల్లోనే ఈ మహమ్మారి అమెరికాలో 3,172 మందిని బలి తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,400కిపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 391 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 6,817కి చేరింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 59 మంది కరోనా వైరస్ బాధితులు చనిపోయారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,400కిపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 391 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 6,817కి చేరింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 59 మంది కరోనా వైరస్ బాధితులు చనిపోయారు. పూర్తి కథనం.. క‌రోనా వైర‌స్ పాజిటివ్ రోగుల‌తోపాటు, క‌రోనా అనుమానిత వ్య‌క్తుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తారు. అయితే త‌మ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రాన్ని త‌ర‌లించాలంటూ మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ దేశ‌మంతా వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ మ‌హమ్మారి కార‌ణంగా కేర‌ళ‌లో నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెందింది. కేవ‌లం రెండు రోజుల కింద‌టే క‌రోనా పాజిటివ్‌గా తేలిన ఈ చిన్నారి.. చికిత్స అందిస్తుండగానే మృత్యువాత ప‌డింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,452కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఒక్క రోజే 1752 కొత్త కేసులను గుర్తించారు. భారత్‌లో ఇప్పటి వరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. కృష్ణాజిల్లా, విజయవాడలో కరోనా పంజా విసురుతోంది. శుక్రవారం ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఎస్సైకి పాజిటివ్‌ తేలింది. వెంటనే ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు ఏపీని కరోనా వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి దగ్గరగా వెళుతున్నాయి. గత రెండు రోజులుగా 150కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే పరీక్షల సంఖ్య పెరగడంతో కేసులు కూడా బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా మహమ్మారిపై యుద్ధంలో ముందు వరుసలో ఉన్నారు డాక్టర్లు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైరస్ సోకిన పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా సేవలు అందిస్తున్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యులపట్ల కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతోపాటు జర్నలిస్టులు సైతం తీవ్రంగా శ్రమిస్తు్న్నారు. క్షేత్రస్థాయిలో కరోనా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి కూడా కరోనా వైరస్ సోకుతోంది.


By April 25, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-of-coronavirus-cases-deaths-in-andhra-and-telangana-across-india-state-wise-live-updates/articleshow/75368763.cms

No comments