ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై అర్థరాత్రి దాడి
రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అతని భార్యపై దాడి జరిగింది. ముంబైలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకొని ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన ఆర్నాబ్ వారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో వారిద్దరికీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. కారుపై , కారు అద్దాలపై రక్తం మరకలు పడిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడింది ఎవరై ఉంటారన్న దానిపై విచారణ ప్రారంభించారు. కాసేపటి క్రితమే దాడితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 504, 341 కింద కేసు నమోదు అయ్యిందన్నారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు రెండు రోజుల క్రితం చేశారు. టీవీ చానెల్ లైవ్ లో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎడిటర్స్ గిల్డ్‌లో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ.. తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై మూకదాడి ఘటనపై తన టీవీలో లైవ్ చర్చా కార్యక్రమం నిర్వహిస్తూనే అర్నబ్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందడంపై ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు శేఖర్ గుప్తా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘పాల్‌ఘర్ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే.. మరో వర్గం వ్యక్తి దాడికి గురయ్యుంటే నసీరుద్దీన్ షా, అపర్ణా సేన్, అనురాగ్ కశ్య్‌ప లాంటి వాళ్లంతా ధ్వజమెత్తేవారు’ అని అర్నబ్ వ్యాఖ్యానించారు.
By April 23, 2020 at 08:49AM
No comments