కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: జన్యురూపాన్ని మార్చుకుంటున్న మహమ్మారి
⍟ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలలో నిషేధాజ్ఞలు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షా 84వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 26.30 లక్షలు దాటింది. ⍟ కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెండో దశ లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. దేశంలో కీలకమైన రైల్వే సేవలు కూడా నిలిచిపోయాయి. కేవలం సరుకు రవాణా మినహా అన్ని ప్యాసింజర్ రైళ్లు మార్చి 25 నుంచి నిలిచిపోయాయి. మార్చి 25 నుంచి మే 7 వరకు ప్యాసింజర్ సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేయడంతో ఆదాయానికి భారీగా గండిపడింది. ⍟ దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,273 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఇందులో 52 శాతం కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌లోనే నిర్ధారణ అయ్యాయి. అలాగే బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మరో 39 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అత్యధిక మరణాలు ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. ⍟ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి జన్యుపరంగా వివిధ మార్పులకు గురైనట్లు చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ‘సార్స్-కొవ్-2’ వైరస్ ఇప్పటికే 30 కంటే ఎక్కువ జాతులుగా రూపాంతరం చెందిందని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో వేర్వేరు రూపాల్లో పంజా విసురుతోందని పరిశోధనలో గుర్తించారు. ఈ పరిణామంతో వైరస్ మరింత తీవ్ర ప్రమాదకారి అవుతుందని, దీనిని మొత్తంగా నివారించే క్రమంలో మరిన్ని సమస్యలు తలెత్తవచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన చెందున్నారు. పూర్తి కథనం.. ⍟ కరోనా భయం జనాల్ని వణికిస్తోంది. చివరికి కుటుంబ సభ్యులు, బంధువులు చనిపోయినా అటువైపుగా వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ భయం ఒక్కోసారి మానవత్వాన్ని చంపేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ⍟ ఏపీలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయినా కొందరు మాత్రం నిబంధనలు పాటించడం లేదు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో కొందరు వాలంటీర్లు లాక్‌డౌన్ నిబంధనల్ని తుంగలో తొక్కారు.. అందరూ కలిసి విందు చేసుకున్నారు. ⍟ విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) కలకలం రేగింది. అనారోగ్యంతో ఉన్న మహిళను పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని సమాచారం. ⍟ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 943కు చేరుకున్నాయి. బుధవారం (ఏప్రిల్ 22) మరో 15 కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో మరో వ్యక్తి మరణించాడు. దీంతో మరణాల సంఖ్య 24కు చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 10 కరోనా కేసులు, సూర్యాపేటలో మరో 3 కేసులు, గద్వాలలో రెండు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. ⍟ కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడు ప్రపంచాన్ని వదిలి పోతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం కరోనా వైరస్ ఇప్పుడప్పుడే మనల్ని వదిలేలా లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం అంత తేలిగ్గా పోదని, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు 2022 వరకూ అవలంబించాల్సి రావచ్చని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సైతం అంచనా వేశారు. ⍟ కరోనాపై పోరాటంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన గేట్స్.. ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను శ్లాఘించారు. కోవిడ్-19ను కట్టడి చేయడం కోసం భారత సర్కారు అద్భుతంగా పని చేస్తోందన్నారు.
By April 23, 2020 at 08:56AM
No comments