బాయ్‌ఫ్రెండ్స్ నమ్మకద్రోహం.. సెక్స్ వీడియో లీక్, యువతి ఏం చేసిదంటే
ప్రియుడితో హద్దులు దాటిన యువతి.. అతడు చేసిన మోసాన్ని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్ నగరంలోని చహరానగర్ ప్రాంతానికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిపై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో వలలో వేసుకుని వెంట తిప్పుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను లొంగదీసుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఇంట్లో పెద్దలు లేని సమయంలో యువతి ఇంటికే వెళ్లి ఆమెను లైంగికంగా అనుభవించేవాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో యువతి కూడా అతడికి అడ్డు చెప్పేది కాదు. Also Read: ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వారిద్దరు ఏకాంతంగా ఉన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది. దీంతో ఆ వీడియో ఆధారంగా స్థానిక యువకులు, ప్రియుడు స్నేహితులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తమను కూడా సుఖపెట్టకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. అసలు తాను ప్రియుడితో గడిపిన దృశ్యాలు బయటకు ఎలా వచ్చాయని యువతికి అనుమానం వచ్చి ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడే తనతో ఏకాంతంగా గడిపిన సమయంలో సెల్‌ఫోన్లో వీడియోలు తీశాడని తెలుసుకుని కుమిలిపోయింది. Also Read: అతడు తనతో శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసమే ప్రేమ నాటకం ఆడాడని, మోజు తీరాక వదిలించుకునేందుకు ఆ వీడియోలను లీక్ చేశాడని తెలుసుకుని యువతి మనోవేదనకు గురైంది. బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు అతడి ముగ్గురు స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By April 23, 2020 at 08:41AM
No comments