Breaking News

గాఢనిద్రలో భర్త.. ప్రియుడితో గదిలో వివాహిత రాసలీలలు.. నగ్నంగా చూశాడని


నగర శివారులో ఈ నెల 8వ తేదీన జరిగిన మహంకాళి కృష్ణ హత్య కేసును పోలీసులు చేధించారు. కారణంగా భార్యే అతడిని హత్య చేసినట్లు తేలింది. దీంతో మేడ్చల్ పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ జిల్లా రాజ బొల్లారం గ్రామ పంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య లక్ష్మి ఉంది. వివాహమై చాలాకాలమైనా వీరికి పిల్లలు పుట్టలేదు. Also Read: కృష్ణ 2014లో తన ఆటోను అదే గ్రామానికి చెందిన గుంటి బాల్‌రాజ్‌కు అమ్మడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అతడి ఇంటికి బాల్‌రాజ్‌ తరచూ వస్తుండటంతో లక్ష్మీతో సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. కొన్నాళ్ల క్రితం లక్ష్మీ, బాల్‌రాజ్‌ల విషయం కృష్ణకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను లక్ష్మి చంపాలనుకుంది. దీంతో భర్తకు ఆమె అనేకసార్లు నిద్రమాత్రలు ఇచ్చింది. అయితే కృష్ణకు అదృష్టం కలిసి రావడంతో అన్నిసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. Also Read: ఈనెల 8న రాత్రి కృష్ణ ఇంట్లో గాఢనిద్రలో ఉండగా లక్ష్మి తన ప్రియుడికి ఫోన్ చేసి రప్పించుకుంది. ఇద్దరూ పడకగదిలో రాసలీలలు సాగిస్తుండగా మెలకువ వచ్చిన కృష్ణ వారిద్దరిని అసభ్యకర రీతిలో చూసి షాకయ్యాడు. వీరి బండారం అందరికీ చెప్పేందుకు బయటకు పరుగు పెడుతుండగా లక్ష్మి, బాల్‌రాజ్ అతడిని పట్టుకుని తీగతో గొంతుకు బిగించి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని పడుకోబెట్టి నాటకమాడారు. మరుసటి రోజు ఉదయం తన భర్త నిద్రలోనే చనిపోయాడని లక్ష్మి స్థానికులను నమ్మించింది. అయితే బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో లక్ష్మి అక్రమ సంబంధం బయటకు రావడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By April 12, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-husband-with-help-of-paramour-in-hyderabad/articleshow/75103915.cms

No comments