Breaking News

పులి నుంచి తప్పించుకున్నా భర్త కళ్లెదుటే ప్రాణం పోయింది.. కన్నీళ్లు పెట్టించే ఘటన


మహారాష్ట్రలోని భండారి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవిలో పులి దాడిలో గాయపడిన భార్యను ఓ వ్యక్తి తన భుజంపై వేసుకుని రోడ్డుపైకి వచ్చినా.. ఆస్పత్రికి తలించేందుకు వాహనం లేక ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని భండార జిల్లా పౌని తాలూకా సావర్ల గ్రామానికి చెందిన మమత షెండే (38), ఆమె భర్త నరేశ్‌ షెండే గ్రామం పక్కనే ఉన్న అడవిలోకి ఇప్పపువ్వు సేకరించేందుకు వెళ్లారు. అదే సమయంలో మమతపై దాడి చేసింది. ఆమెను గొంతు వద్ద నోట కర్చుకుని చాలాదూరం ఈడ్చుకెళ్లింది. ఆమె కేకలు విని నరేశ్‌ కర్రతో అరుస్తూ పులిని వెంబడించాడు. కొద్ది దూరంలో మమతను వదిలేసిన పులి అడవిలోకి పారిపోయింది. Also Read: చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నరేశ్‌ తన భార్యను భుజాలపై వేసుకొని అర కిలోమీటరుకు పైగా కాలినడకన పౌని వెళ్లే హైవేపైకి తీసుకువచ్చాడు. అక్కడి నుంచి పౌని ఆస్పత్రి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి తీసుకుని పోయేందుకు నరేశ్ వాహనం కోసం చాలాసేపు ఎదురుచూశాడు. లాక్‌డౌన్ కారణంగా ఒక్క వాహనం కూడా అటువైపు రాలేదు. పరిస్థితి విషమించడంతో మమత భర్త కళ్లెదుటే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న భండార ఫారెస్ట్ ఆఫీసర్ వివేక్‌ హోసింగ్‌ ఘటనాస్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని పౌని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియల కోసం రూ.25 వేల సాయం అందించారు. నరేశ్, మమత దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. Also Read:


By April 20, 2020 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-killed-by-tiger-in-maharastras-bhandara-district/articleshow/75245414.cms

No comments