Breaking News

ఆ నగరాల్లో కరోనా అత్యంత తీవ్రంగా ఉంది.. కేంద్రం హెచ్చరికలు


ముఖ్యంగా ముంబయి, పుణే, ఇండోర్, జయపుర, కోల్‌కతా, పశ్చిమ్ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రంగా ఉందని సోమవారం కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిచండంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు తీవ్రంగా ఉందని హెచ్చరించింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందజేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు, సామాజిక దూరం పాటించకపోవడం, పట్టణాల్లో భారీగా వాహనాల రోడ్లపైకి రావడం లాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోం శాఖ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 17,300పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 543 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్రలోని ముంబయి, పుణే, రాజస్థాన్‌లోని జయపూర్, పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా, ఈస్ట్ మేదినీపూర్, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్, కాలింపాంగ్, జలపాయ్‌గురిలో పరిస్థితి తీవ్రంగా ఉందని హోం శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని, పెద్ద ఎత్తున కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించనుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఆరు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్‌ (ఐఎంసీఎటీ) ను కేంద్రం ఏర్పాటుచేసి.. ఎప్పటి కప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలకు అవసరమైన సూచనలు చేస్తోంది. ఈ బృందాలు తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిపింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్ అమలుపై ఈ ఐఎంసీటీలు దృష్టి సారించనున్నాయి. నిత్యావసరాల సరఫరా, సామాజిక దూరం, ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధత, ఆరోగ్య నిపుణుల భద్రత, నిరుపేదలు, కూలీల సహాయ శిబిరాల పరిస్థితుల గురించి నివేదిక రూపొందించిన కేంద్రానికి అందజేయనున్నాయి.


By April 20, 2020 at 12:33PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ministry-of-home-affairs-warns-coronavirus-situation-serious-in-mumbai-kolkata-jaipur-indore/articleshow/75245976.cms

No comments