లాక్‌డౌన్‌లో అఘాయిత్యాలు... చాక్లెట్లు ఆశచూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం

దేశమంతా కరనా భయంతో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతే కామాంధులు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై పక్కింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి బుధవారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఆమెను గమనించిన పక్కింట్లో ఉండే పవన్ సింగ్(18) బాలికను మాటల్లో దించాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పిన తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. Also Read: ఆ సమయంలో అతడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుపు విన్న తల్లి వెంటనే అతడి ఇంటికి రాగా నిందితుడు పరారయ్యాడు. బాలిక జననాంగాల వద్ద రక్తస్రావం కావడంతో ఆమె స్థానికుల సాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడు పవన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. Also Read:
By April 09, 2020 at 09:42AM
No comments