Breaking News

చైతన్య, సాయి పల్లవి రొమాన్స్.. సమంత ఏమంటారో?


చైసామ్.. ఇలా విడదీయడానికి కూడా ఆస్కారం లేని ఒకే పేరుతో ఏకమై హాయిగా సంసారం సాగిస్తున్న ఈ సెలబ్రిటీ కపుల్ టాలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ కూడా. అయితే వీళ్ళిద్దరూ ఒకే ప్రొఫెషన్‌‌కి సంబందించిన వాళ్ళు కావడం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నాగ చైతన్య ‘లవ్ స్టోరి’.. అంటే ఆయనకి, సమంతకి మధ్య నడిచిన రియల్ లైఫ్ లవ్ స్టోరీ కాదు. చైతూ హీరోగా నటిస్తున్న రీల్ లైఫ్ ‘లవ్ స్టోరి’ గురించి. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగ చైతన్య ‘లవ్ స్టోరి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. సాయి పల్లవి ఎలాంటి సీన్‌లో అయినా నటించమంటే జీవిస్తుంది. అలాగే ‘లవ్ స్టోరి’లో కూడా లవ్ ఫీల్ ఉన్న సీన్స్‌లో ఒక రేంజ్‌లో జీవించిందట. అయితే ఈ సినిమాలో ఫీల్‌తో పాటు కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా జోడించారు శేఖర్ కమ్ముల. దానిలో భాగంగా కొన్ని కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో సాయి పల్లవి చైతూకి గట్టిగా ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉంది. అయితే, సినిమాలో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి అంటున్నారు. ‘లవ్ స్టోరి’ అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఆ మాత్రం ఉండాల్సిందే. Also Read: అయితే వీటి గురించి సమంత ఫీలింగ్ ఏంటి? అనేది ఇండస్ట్రీ వినిపిస్తోన్న గుసగుస. ‘మజిలీ’ సినిమాలో చైతూకి, దివ్యాన్ష కౌశిక్‌‌‌కి మధ్య ‌‌‌‌ఒక లిప్ లాక్ ఉంది. ఆ సీన్‌ని ఫైనల్ కాపీలో కూడా అలానే ఉంచారు.‌ ఆ సీన్‌పై స్పందిస్తూ అదంతా పార్ట్ అఫ్ ప్రొఫెషన్ అని అదే సినిమాలో నటించిన సమంత అన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో చాలా కిస్ సీన్స్, క్యూట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సీన్స్‌లో సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి జీవించారు అని కూడా యూనిట్ మెంబర్స్ అంటున్నారు. ఎంత హీరోయిన్ అయినా సమంత కూడా అమ్మాయే కదా.. అమ్మాయిలకు పొసెసివ్‌నెస్ కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. మరి, ఈ సినిమా చూసిన తరువాత సమంత స్పందన ఎలా ఉంటుంది అనే డిస్కషన్ నడుస్తుంది. తనకు నచ్చని అంశాలపై ఇన్‌డైరెక్ట్‌గా, సెటైరికల్‌గా స్పందించే సమంత ఈ సినిమాపై ఎలా స్పందిస్తారో?, లైవ్‌లో ఎవరైనా నెటిజన్స్ ఈ ప్రశ్నలు సందిస్తే ఎలాంటి ఆన్సర్ ఇస్తారో అని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఫిల్మ్ నగర్ పీపుల్.


By April 10, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/how-samantha-reacts-about-naga-chaitanya-sai-pallavi-romantic-scenes-in-love-story/articleshow/75077296.cms

No comments