నీళ్ల కోసం చెరువులో దిగి ముగ్గురు చిన్నారుల మృతి

కర్ణాటకలోని జిల్లా సింధనూరు తాలూకా రౌడుకుంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీళ్లు తెచ్చేందుకు గురువారం చెరువుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి దుర్మరణం చెందారు. గ్రామంలో ఓ ప్రైవేటు వ్యక్తి చెరువులో నుంచి నీళ్లు తెచ్చేందుకు రవికుమార్ (12), నాగరాజ్ (8), కార్తీక్ (7) తోపుడు బండిలో కడవలను పెట్టుకుని తోసుకుంటూ వెళ్లారు. వీరిలో ఒకరు కాలు జారి చెరువులో పడిపోగా.. కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. Also Read: పిల్లలు ఎంతసేపటికే ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన కుటుంబసభ్యులు చెరువ వద్దకు వెళ్లి చూసేసరికి విగతజీవులుగా పడి ఉన్నారు. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో రవికుమార్, నాగరాజ్ సొంత అన్నదమ్ములు. నీళ్లు తాము తెస్తామని చెప్పినా వినకుండా పిల్లలు చెరువు వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని రవి, నాగరాజ్ తండ్రి వీరేశ్ రోదిస్తున్నాడు. మృతదేహాలకు సింధనూరు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు. Also Read:
By April 10, 2020 at 10:48AM
No comments