Breaking News

రంజాన్ వేళ ముస్లిం సోదరులకు డబ్ల్యూహెచ్ఓ సూచనలు.. తప్పక పాటించాలి


ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల రోజులు పాటు ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి.. సామూహికంగా ప్రార్ధనలు నిర్వహిస్తారు. నెల రోజులూ ఇఫ్తార్ (విందులు) పెద్ద ఎత్తున్న సాగుతాయి. అయితే, ఈ ఏడాది మాత్రం రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్‌కు రూపంలో పెద్ద ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముస్లింలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున సామూహిక ప్రార్ధనలు, మతపరమైన కార్యక్రమాలను రద్దుచేసుకోవాలని సూచించింది. ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 1.65 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, మహమ్మారి ముప్పు పెరగకుండా ఉండాలంటే సామూహాలుగా గుమిగూడి ఉండవద్దని పేర్కొంది. సామూహిక ప్రార్థనలు రద్దుచేసుకుని దీని స్థానంలో టెలివిజన్, డిజిటల్, సోషల్ మీడియా వేదిక లాంటి ప్రత్యామ్నాయలను వినియోగించుకోవాలని పేర్కొంది. రంజాన్ సందర్భంగా కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర సలహాలను జాతీయ ఆరోగ్య సంస్థలు తెలియజేయాలని సూచించింది. వీటిని పాటించడంలో మత పెద్దలు కీలక పాత్ర పోషించాలని తెలిపింది. ప్రార్థనల కోసం గుంపులు గుంపులుగా ఉండకపోవడం ఉత్తమైందని, తమను తాము కాపాడుకుంటూనే ఇతరుల ఆరోగ్యం కాపాడుతూ రంజాన్ మాసంను జరపుకోవాలని తెలిపింది. సదాకత్‌ లేదా జకా కార్యక్రమం నిర్వహించే సమయంలో అంతా సామాజిక దూరం పాటించాలని, ఇఫ్తార్‌లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడరాదని సలహా ఇచ్చింది. దీని బదులుగా బాక్సుల్లో ప్యాక్ చేసి ఆహారం పంపాలని సూచనలు చేసింది. పలు దేశాల్లో సామూహిక ప్రార్థనలను ఇప్పటికే నిషేధం ఉన్నందున ఉన్నచోటనే ఆన్‌లైన్ ద్వారా ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచనలు చేసింది నమాజ్‌కు ముందు ముస్లింలు నిర్వహించే వుడు.. శుభ్రతను సూచిస్తుంది. ఈ సమయంలో 70 శాతం ఆల్కహాల్ ఉన్న శానిటైజర్, సబ్బుతో చేతులు శుభ్రంచేసుకోవాలంది. వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేయడం మరువకూడదని, ప్రార్థనల సమయంలో ప్రత్యేకంగా ఉంచే రగ్గులను కార్పెట్‌పై ఉంచాలని సూచించింది. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని.. కనీసం వ్యక్తికి వ్యక్తి మధ్య 1 మీటరు దూరం అంటే కనీసం మూడడుగుల దూరంలో ఉండాలని మార్గదర్శకాల్లో వివరించింది. ఇక ఆత్మీయ ఆలింగనాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని... చేతులు ఊపడం, గుండెపై చేతులుపెట్టుకుని కానీ అభినందనలు తెలపాలని సూచించింది. రంజాన్‌ మాసంతో ముడిపడి ఉన్న దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా గుమికూడరాదని సూచించింది.


By April 20, 2020 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/who-advice-on-iftar-and-ramadan-due-to-coronavirus-pandemic/articleshow/75244141.cms

No comments