Breaking News

గుంటూరు జిల్లాలో దారుణం.. పోలీసుల దెబ్బలు తాళలేక యువకుడి మృతి


జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. పోలీసుల దెబ్బలు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సత్తెనపల్లిలోని వెంకటపతి కాలనీకి చెందిన మహమ్మద్ గౌస్ (28) సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో మెడికల్ షాప్‌కి వెళ్లి కొన్ని మందులు కొనుగోలు చేశాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో అతడిని పోలీసులు ఆపారు. మందుల కోసం బయటకు వచ్చానని చెప్పినా వినిపించుకోకుండా లాఠీలతో కొట్టడంతో గౌస్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. Also Read: దీంతో పోలీసులే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరగంట తర్వాత గౌస్ మృతిచెందాడు. అయితే గౌస్‌కు గుండె జబ్బు ఉందని, పోలీసుల కొడుతున్న సమయంలో ఆందోళనకు గురై గుండెనొప్పితో చనిపోయిట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 6-9 గంటల మధ్య నిత్యావసరాల కోసం అనుమతి ఉందని, ఆ సమయంలో మందుల కోసం బయటకు వచ్చిన గౌస్‌ను ఎందుకు కొట్టారంటూ స్థానికులు పోలీసులను నిలదీస్తున్నారు. Also Read: ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఐజీ ప్రభాకర్‌రావు స్పందించారు. పోలీసులు గౌస్‌ను కొట్టలేదని, బయటకు ఎందుకొచ్చావని నిలదీస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తెలిపారు. అతడికి గతంలోనే గుండె జబ్బు ఉందని, పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో భయానికి గురికావడంతో గుండెనొప్పి వచ్చి చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేస్తున్నట్లు ఐజీ తెలిపారు. గుంటూరు అడిషనల్ ఎస్పీ చేరుకుని విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలంలో విధుల్లో ఉన్న పోలీసులను ఆయన విచారించి వివరాలు సేకరించారు. మరోవైపు పోలీసుల దెబ్బల వల్లే గౌస్ చనిపోయాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాధ్యులైన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By April 20, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-died-over-police-beating-in-sattenapalle-guntur-district/articleshow/75244238.cms

No comments