Breaking News

ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన వివాహిత... కృష్ణా జిల్లాలో దారుణం


వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన ఘటన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని హెచ్‌.ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో కందులపాడుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరికీ అప్పటికే వివాహాలు అయ్యాయి. ప్రియుడి మోజులో భర్తతో విడిపోయిన ఆ మహిళ కందులపాడు అడ్డరోడ్డు వద్ద బడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తోంది. దీంతో కోటేశ్వరరావు తరుచూ అక్కడికి వస్తూ ప్రియురాలితో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు. Also Read: ఇటీవల మహిళకు, కోటేశ్వరరావుకు మధ్య స్వల్ప వివాదం ఏర్పడింది. దీంతో కోటేశ్వరరావు కొద్దిరోజులుగా ప్రియురాలి దగ్గరకు వెళ్లడం మానేశాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఇతరులతో కబురు పెట్టినా అతడు స్పందించడం లేదు. చివరికి ఆదివారం ఫ్రెండ్‌తో కలిసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తనను ఎందుకు దూరం పెట్టావంటూ ఆ మహిళ కోటేశ్వరరావుతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వివాదం పెద్దదైంది. Also Read: దీంతో ఆ మహిళ కోపం పట్టలేక కోటేశ్వరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో షాకైన అతడి ఫ్రెండ్ చుట్టుపక్కల వారి సాయంతో మంటలను ఆర్పివేసి జి.కొండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. శరీరం చాలాభాగం కాలిపోవడంతో కోటేశ్వరరావు మృత్యువుతో పోరాడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. Also Read:


By April 13, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-man-set-ablaze-by-girl-friend-in-krishna-district/articleshow/75114545.cms

No comments