కాపురంలో లాక్‌డౌన్ చిచ్చు... భర్త ఎడబాటు తట్టుకోలేక భార్య ఆత్మహత్య


కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీలు తిండి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరేమో కుటుంబసభ్యులకు దూరమై నరకం అనుభవిస్తున్నారు. కొందరేమో జీవిత భాగస్వాముల ఎడబాటును తట్టుకోలేక ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా భర్త దూరంగా ఉండిపోవడంతోఎడబాటు భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లా గోరంట్లలో విషాదం నింపింది. Also Read: మండలం బూడిదగడ్డపల్లికి చెందిన చిన్నపరెడ్డి బెంగళూరులో మెడికల్ స్టోర్ నిర్వహిస్తూ భార్య మమత, కుమార్తెలు భవ్యశ్రీ(11), నిహారిక(9)తో కలిసి అక్కడే ఉంటున్నాడు. బెంగళూరులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మార్చి నెలలోనే భార్య, పిల్లలను స్వగ్రామానికి పంపించేశాడు. కొద్దిరోజులకే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో చిన్నపరెడ్డి బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే ఇంటికి రావాలని భార్య ఎన్నిసార్లు కోరినా రవాణా సౌకర్యం లేకపోవడంతో అతడు రాలేకపోయాడు. Also Read: దీంతో భర్త ఎడబాటు భరించలేకపోయిన మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్తకు దూరంగా ఉండలేక మంగళవారం ఇంటి వెనుకున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు వేలాడుతున్న మమతను చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూసేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మమతకు భర్తంటే ఎంతో ఇష్టమని, అతడితో కలిసి ఉండలేకపోతున్నానన్న బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. Also Read:
By April 22, 2020 at 07:44AM
No comments