Breaking News

గుంటూరులో దారుణం.. తల్లి ఫోన్ లాక్కుందని బాలిక ఆత్మహత్య


ఇటీవల కాలంలో పిల్లలు మరీ సెన్సిటివ్‌గా ఉంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో, స్కూల్లో టీచర్లు కొట్టారనో, టీవీ రిమోట్ ఇవ్వలేదనో, నచ్చిన కూర వండలేదనో.. ఇలా ఏదైనా చిన్నచిన్న కారణాలతో ఏకంగా ప్రాణాలనే తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలో ఓ మైనర్ బాలిక చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. Also Read: మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన కారంకి స్నేహ స్మిత (14) అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలోనే తల్లి ఫోన్ తీసుకుని తరుచూ అందులో గేమ్స్ ఆడటం, ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేయడం బాగా అలవాటు చేసుకుంది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాట వినిపించుకోలేదు. సోమవారం ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతుండగా గమనించిన తల్లి ఝాన్సీరాణి బాలికను మందలించి ఫోన్ లాక్కుంది. Also Read: దీంతో మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన తల్లి కూతురు ఫ్యాన్‌కు వేలాడటాన్ని చూసి షాకైంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By April 22, 2020 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/14-yr-old-girl-commits-suicide-in-tenali-guntur-district/articleshow/75283890.cms

No comments