Breaking News

బయట తిరగొద్దని మందలిచిన భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య


‘బయట తిరిగితే కరోనా వైరస్ అంటుకుంటుంది... అందుకే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఆ వైరస్ సోకితే ప్రాణాలే పోతున్నాయి. బుద్ధిగా ఇంట్లోనే ఉండు’ అని భర్తకు మంచి మాటలు చెప్పడమే ఆమె తప్పయింది. భార్య మాటలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని జిల్లా రాయపోల్‌ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. Also Read: లింగారెడ్డి గ్రామానికి చెందిన మంద రాములు (60) కుమారుడు రాజుతో కలిసి గజ్వేల్‌ పట్టణంలో కొంతకాలంగా ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణం మూతపడటంతో రాములు కుటుంబంతో కలిసి లింగారెడ్డిపల్లికి వచ్చేశాడు. అయితే ఇంటిపట్టున ఉండకుండా రాములు రోజూ ఊరంగా తిరిగి బంధువులు, స్నేహితులను కలుస్తూ ఉన్నాడు. మంగళవారం కూడా వెళ్లొచ్చాడు. Also Read: అలా ఇష్టం వచ్చినట్లు బయట తిరిగితే కరోనా వైరస్ సోకుతుందని, ఇంటి దగ్గరే ఉండాలని భార్య అంజమ్మ రోజూ భర్తకు చెబుతోంది. ఆమె మాటలు పట్టించుకోని రాములు బయట తిరుగుతుండటంతో ఆమె భర్తను నిలదీసింది. మంగళవారం వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అయితే భార్య తనను నిలదీయడాన్ని తట్టుకోలేకపోయిన రాములు మనస్తాపం చెందాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలో ఉన్న మామిడిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే రాములు కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతకగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. Also Read:


By April 23, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/60-yr-old-man-commits-suicide-in-gajwel-over-argument-with-wife/articleshow/75311463.cms

No comments