ప్రముఖ రచయిత శ్రీ శ్రీ బొమ్మ గీసిన బ్రహ్మానందం
లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రజలు తమలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీస్తున్నారు. ప్రముఖ తారలంతా తమలో ఉన్న కళా నైపుణ్యాల్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు వంట చేస్తుంటే.. మరికొందరు ఇంటి పనులు చేస్తున్నారు. ఇంకొందరు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఓ బొమ్మ గీశారు. అయితే ఆయన గీసిన చిత్రం మామూలు వ్యక్తిది కాదు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన హాస్య బ్రహ్మం... తనలోని చిత్రకారుడిని నిద్రలేపారు. ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) చిత్రాన్ని ఆయన పెన్సిల్ తో గీశారు. ఆ చిత్రాన్ని బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్, తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'రంగమార్తాండ'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు బ్రహ్మానందం. అనేక సినిమాల్లో తనదైన శైలిలో కామెడ చేస్తూ అందరినీ నవ్వించారు.
By April 20, 2020 at 11:25AM
No comments