Breaking News

చైనాలో కరోనా మరణాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అగ్రరాజ్యంలో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. కరోనా విషయంలో ఇప్పటికే చైనా తీరుపై మండిపడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మరణాల సంఖ్య చైనా ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని ట్రంప్ ఆరోపించారు. వుహాన్‌లో కొవిడ్‌-19 మరణాల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారిక ప్రకటన జారీ చేసింది. అందులో వూహాన్‌‌లో కరోనా మరణాలు దాదాపు 50 శాతం అంటే 1,290 మరణాలను అదనంగా చేర్చారు. దీంతో డ్రాగన్‌ దేశంలో సంభవించిన మరణాల సంఖ్య ఒకేసారి 40శాతం పెరిగింది. ఆ సంఖ్య 4,632కు చేరింది. అయితే చైనా చెబుతున్న ఈ లెక్కలపై ట్రంప్ విమర్శలు చేశారు. మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు. ''కొవిడ్‌-19 మరణాల సంఖ్యను చైనా ఒక్కసారిగా రెట్టింపు చేసింది. మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అమెరికా కంటే కూడా ఎక్కువే ఉంటుంది. మరణాల విషయంలో యూఎస్‌ వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లదు'' అన్నారు డొనాల్డ్ ట్రంప్. చైనాలో మరణాలపై ఇప్పటికే అనేక దేశాల్లో అనుమానాలు ఉన్నాయి. మిగిలిన దేశాల్లో వేలసంఖ్యలో కరోనా మరణాలు ఉన్నప్పుడు... వైరస్ పుట్టి పెరిగిన ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఎలా తక్కువగా ఉంటుందని అనేక దేశాలకు ప్రశ్నిస్తున్నాయి. కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని ఇప్పటికే ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం చైనాకు మద్దతుగా నిలిచిందని ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ కారణంతోనే ట్రంప్ WHOకు ఇవ్వాల్సిన నిధుల్ని కూడా నిలిపివేశారు. మరోవైపు ట్రంప్ పాలకవర్గం కరోనా విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ పనితీరుపై విచారణ కూడా సిద్దమైంది. తాజాగా మరణాల విషయంలో కూడా ట్రంప్ చేస్తున్న ఆరోపణలపై...కరోనా ఎదుర్కొంటున్న ఇతర దేశాల్ని సైతం ఆలోచనలో పడేస్తున్నాయి. నిజంగా చైనా అందర్నీ మోసం చేస్తుందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


By April 18, 2020 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/donald-trump-denies-us-has-most-deaths-and-says-strange-things-are-happening-in-china/articleshow/75215191.cms

No comments