Breaking News

కరోనా వైరస్ లైప్ అప్‌డేట్స్: ఐరోపా, అమెరికాలో కొనసాగుతున్న విలయతాండవం


ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల ప్రాణాలనే కాదు, వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై.... అన్ని వ్యవస్థలపై చూపిస్తోంది. తాజాగా రక్తానికి కూడా కొరత ఏర్పడింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్‌ను మరో 19 రోజుల పాటు పెంచారు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ అధికమవుతోంది. వైరస్‌ను కట్టడిచేయడానికి విధించిన రెండో విడత లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతుండగా.. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు వ్యవసాయం, అనుబంధ రంగాలు సహా పలు విభాగాలకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉండగా.. కేసుల గ్రోత్ ఫ్యాక్టర్ నెమ్మదించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయానికి 14 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,100 కొత్త కేసులు వెలుగుచూడగా, మరో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే... లాక్‌డౌన్‌ విధించడంతో దేశంలో పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం గణనీయంగా తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి కేసుల సంఖ్య 240కిపైనే ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు భయపడిపోతున్నారు.. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 126 కేసులు నమోదయ్యాయి.. ఇద్దరు చనిపోయారు. ⍟ క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్‌ను దేశ‌వ్యాప్తంగా విధించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్‌వేళ భార‌త్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల వీసాల‌ గడువును కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా మే 3 వ‌ర‌కు పొడిగించింది. మ‌రోవైపు విదేశీయుల‌కు ఇచ్చిన వీసాల‌ను మే 3 వ‌ర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నీ దాదాపుగా మూతపడ్డాయి. దీంతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. పేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం.. త్వరలోనే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది. లాక్‌డౌన్ కారణం దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుబడి పోయారు. రాజస్థాన్‌లోని ప్రముఖ కోచింగ్ సంస్థలకు నెలవైన కోట‌ పట్టణంలో కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులు లాక్‌డౌన్ కార‌ణంగా అక్క‌డే ఉండిపోయారు. తాజాగా వీరిలో ఏడు వేల మందిని తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు భారీ సంఖ్యలో బస్సులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పంపింది. దేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు రాకపోకలు చేసే రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. అయితే, చైనాలో కరోనా వైరస్ ప్రబలుతున్న సమాచారం తెలియగానే గోవా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దేశంలోనే తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులను పరీక్షించేందుకు స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం రోజు కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కు చేరింది. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. మొదటిసారిగా ఈ నెల 2న ఒక్క వ్యక్తికి పాజిటివ్ అని తేలగా, కేవలం 15 రోజుల వ్యవధిలోనే కరోనా కేసులు బాగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే సూర్యాపేటలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


By April 18, 2020 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-of-coronavirus-cases-and-deaths-in-india-state-wise-live-updates-in-telugu/articleshow/75215110.cms

No comments