కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: అగ్రరాజ్యంపై పగబట్టిన కరోనా.. ఆగని మరణాలు

⍟ ప్రపంచవ్యాప్తంగా విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారికి బారినపడి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 134, 615 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే కరోనా మరణాలు 28వేలు దాటింది. ఇటు, ఐరోపాలోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లోనూ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ప్రపంచంలోని మొత్తం 210కిపైగా దేశాలకు విస్తరించిన .. అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమవుతోంది. ప్రపంచ ఆర్ధిక రాజధాని నగరం న్యూయార్క్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. ⍟దేశంలో కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రెండో విడత లాక్‌డౌన్ బుధవారం నుంచి కొనసాగుతోంది. మే 3 వరకు కొనసాగే ఈ లాక్‌డౌన్ సమయంలో ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే చర్యలను కేంద్రం చేపట్టింది. ఏప్రిల్ 20 నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల నిర్వహణకు వెసులుబాటు కల్పించింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన నిబంధనలను బుధవారం కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. రెండో విడత లాక్‌డౌన్‌లో కరోనా వైరస్ గొలుసును తెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ⍟ గుంటూరు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొత్తం 122 కేసులుంటే.. నలుగురు డిశ్చార్జ్ కాగా.. 118మందికి వైద్యం అందిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్‌లుగా ప్రకటించారు.. అక్కడ లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. ⍟తెలంగాణలో కొత్తగా 6 కేసులు నమోదు కాగా.. బుధవారం 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 650కి చేరగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం మీడియా బుల్లెటిన్ ద్వారా వెల్లడించింది. ⍟ ఓ వ్యక్తి జీవితంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్, సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇవి సత్ఫలితాలనిస్తాయని అంతా కొండంత ఆశతో ఉన్నారు. మునుపెన్నడూ మనిషి ఎదుర్కోలేని ఇలాంటి సందర్భాలను భరించడం ప్రతి వ్యక్తికి కాస్త ఇబ్బందిగా ఉంటున్న మాట వాస్తవమే. ⍟ కారణంగా వలస కూలీలు, అభాగ్యులు పొట్ట నింపుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వాలు వారికి ఆహారం అందించడానికి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొందరికి మాత్రం ఆహారం అందడం లేదు. ఇటీవలే ఆగ్రాలో పాల ట్యాంకర్ బోల్తా పడగా.. పాలన్నీ రోడ్డు మీద పడియాయి. .. ⍟ దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లాల్లో మొత్తం 170 జిల్లాలు హాట్ స్పాట్స్‌గా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించగా.. మరో 207 జిల్లాలను పొటెన్షియల్ హాట్ స్పాట్ జిల్లాలుగానూ, మిగిలిన వాటిని గ్రీన్‌జోన్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే మరో 42 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 525కు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది
By April 16, 2020 at 09:01AM
No comments