చిత్తూరు జిల్లాలో మహిళ దారుణహత్య.. అత్యాచారంపై అనుమానాలు

జిల్లాలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. బి.కొత్తకోట మండలం నాగులవారికుంట వద్ద శనివారం కాలుతున్న ఓ మహిళ మృతదేహాన్ని పశువుల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని తెల్లవారుజామున దహనం చేసి ఉంటారని, అంతకు కొన్ని గంటల ముందు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. Also Read: మృతురాలి వయసు 30-35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కాళ్లకు మెట్టెలు ఉండటంతో వివాహితగా భావిస్తున్నారు. మృతదేహం తరలించేందుకు వీలులేకుండా ఉండటంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆమెపై అత్యాచారం చేసి చంపారా? లేదా? అన్నది కూడా తేల్చాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతురాలు ఎవరనేది తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. Also Read:
By April 12, 2020 at 08:45AM
No comments