Breaking News

అక్రమ సంబంధం అనుమానంతో భార్య చంపి.. ఇంటి పక్కనే పాతిపెట్టి


వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లా మండలం నారెగూడెంలో వెలుగుచూసింది. పరడకు చెందిన పెండ్యాల కృష్ణయ్యతో నారెగూడేనికి చెందిన ప్రభ(35)కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ నారెగూడెంలోనే కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కృష్ణయ్య ఇంటికి అదే గ్రామంలో నివసిస్తున్న ప్రభ తల్లి పార్వతమ్మ వచ్చింది. ఇంటి ఆవరణలో రక్తపు మరకలు ఉండటం, తన కుమార్తె కనిపించకపోవడంతో అనుమానంతో అల్లుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. Also Read: దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ నాగదుర్గప్రసాద్‌, ఎస్సై జీకే ప్రసాద్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇంటి ఆవరణలో కట్టెల మోపు కింద అడుగు లోతులో పాతిపెట్టిన ప్రభ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. తలపై రాతితో బలంగా కొట్టడంతో ప్రభ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మద్యానికి బానిసైన కృష్ణయ్య.. తన కూతురికి అక్రమ సంబంధాలు అంటగట్టి తరుచూ వేధిస్తున్నాడని ప్రభ తల్లి పోలీసులకు చెప్పింది. ఇప్పుడు ఏకంగా తన కూతురి ప్రాణాలే తీసేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By April 13, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-kills-wife-in-nalgonda-district/articleshow/75115231.cms

No comments