Breaking News

అన్నతో ప్రేమ.. ప్రియుడితో కలిసి అక్క హత్య.. తమిళనాడులో దారుణం


అన్న వరుసయ్యే యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి దారుణానికి పాల్పడింది. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో తోడబుట్టిన అక్కనే ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. కోసవంపట్టి దేవేంద్రపురానికి చెందిన శంకరన్‌‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె మోనిషా(18) నామక్కల్‌లో ఇంజినీరింగ్‌ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 4న ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో మోనిషా ఒంటరిగా ఉంది. వారు ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె ఎడమచేతి మణికట్టు కోసుకున్న స్థితిలో తీవ్ర రక్తస్రావంతో కనిపించింది. Also Read: దీంతో తల్లిదండ్రులు మోనిషాను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. అయితే తమ కూతురిని ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు లేవని, ప్రేమ వ్యవహారం కూడా లేదని చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో మోనిషా మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను గొంతు నులిమి చంపేశారని, ఆ తర్వాత ఎడమ చేతిని కత్తితో కోశారని వెల్లడైంది. Also Read: దీంతో దీన్ని హత్యకేసుగా మార్చిన పోలీసులు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులందరినీ ప్రశ్నించారు. విచారణలో మోనిషా చెల్లెలు(17) తడబడుతూ సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వ్యవహారశైలిపై లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. మోనిషా చెల్లెలు రాహుల్(19) అనే బంధువుల అబ్బాయిని ప్రేమించింది. అతడు అన్న వరుస కావడంతో కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. మోనిషా కూడా చెల్లెలి ప్రేమను తిరస్కరించింది. ఈ వ్యవహారంతో కొద్దిరోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అక్క కారణంగానే తన ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించారని మోనిషా చెల్లెలు కక్ష పెంచుకుంది. ఈ నెల 4వ తేదీన మోనిషా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడిని రప్పించి గొంతు నులిమి దారుణంగా హత్య చేయించింది. నేరం బయట పడకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేతి మణికట్టును కత్తితో కోసింది. పోస్టుమార్టం రిపోర్టులో అసలు నిజం వెల్లడి కావడంతో ప్రేమజంట జైలు పాలైంది. Also Read:


By April 08, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-kills-sister-with-help-of-boy-friend-in-tamil-nadu/articleshow/75039541.cms

No comments