Breaking News

కరోనా వైరస్ లైప్ అప్‌డేట్స్: అమెరికాలో కరోనా బారినపడ్డ అనేక మంది భారతీయులు


ఆంధ్రప్రదేశ్‌లో నిర్ధారణ పరీక్షలు గంటలోనే పూర్తయి ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకు అవసరమైన టెస్టింగ్‌ కిట్‌లను విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా 100 కిట్‌లను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలనకు పంపింది. వాటి పనితీరును ఐసీఎంఆర్‌ పరిశీలించి, వినియోగానికి అనుమతించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏఎంటీజడ్‌లోని రెండు పరిశ్రమలు ఈ కిట్‌ల తయారీని ప్రారంభించాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న అమెరికాలో భారతీయులు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అమెరికా మొత్తంలో ఈ రెండు రాష్ట్రాల్లోనే భారతీయులు ఎక్కువగా ఉన్నారు. తమ వారికి కరోనా సోకిందని భారతీయుల నుంచి తమకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు ప్రవాస భారతీయ సంఘాల నేతలు చెప్పారు. ఈ సంఘాల నాయకుల్లోనూ అనేక మందికి కొవిడ్‌-19 సోకింది. గతేడాది డిసెంబరు చివరిన చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్ () ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 208 దేశాలకు విస్తరించి.. కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ శర వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఐరోపా దేశాలు, అమెరికాలో కొవిడ్‌ మరణ మృదంగం కొనసాగుతోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే దాదాపు 3,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రెండో దశను దాటి సామూహిక వ్యాప్తిలోకి ప్రవేశించినట్టు ఎయిమ్స్ సైతం ధ్రువీకరించింది. ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో మహమ్మారి మరింత ఉద్ధృతంగా ఉంది. మొత్తం 211 జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఐదు వేలు దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం మరో 11 మందికి కరోనా పాజిటివ్ రాగా, మొత్తం కేసులు 314కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. అమెరికాలో గత 24 గంటల్లో 1,150 మరణాలు చోటుచేసుకున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లకు వైరస్‌ సోకడం కలవర పరుస్తోంది. న్యూయార్క్‌లో స్థిరపడిన తెలుగు వ్యక్తి ఒకరు ఈ మహమ్మారి కాటుకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. శంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన న్యాయమూర్తులు.. బార్ లీడర్లు, వైద్య నిపుణులతో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అనంతరం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించడం మొదటిది కాగా.. తెలంగాణ కోర్టులకు ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేయడం రెండోది. కరోనా వైరస్ ప్రభావంతో ఫ్రాన్స్ విలవిల్లాడుతోంది. ఆ దేశంలో ఒక్కరోజే 1427 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ వైరస్ బారిన పడి 10 వేల మందికిపైగా చనిపోయారని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది. అదే సమయంలో ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య కూడా లక్ష దాటింది. ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 109,069కి చేరగా.. మరణాల సంఖ్య 10,328కి చేరింది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మంగళవారానికి 404కు చేరుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే 40 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఈరోజు ఏ ఒక్కరూ డిశ్చార్జి కాలేదని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు మొత్తం 348 మంది ఉన్నారు.


By April 08, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-of-coronavirus-cases-and-death-updates-in-india-state-wise-live-updates/articleshow/75039275.cms

No comments