సీనియర్ నటి శోభన ఫేస్ బుక్ హ్యాక్..
దక్షణాది సీనియర్ నటి, ప్రముఖ క్లాసికల్ డాన్సర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డాన్స్ ద్వారా ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవచ్చో తెలియజేస్తూ పలు వీడియోను విడుదల చేస్తున్న ఫేస్ బుక్‌ను హ్యాక్ చేశారంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది శోభన. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభన. ‘డియర్ ఫ్రెండ్స్.. నా వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. దాన్ని పోలీసుల సాయంతో తిరిగి క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ బుక్ ఖాతాని తిరిగి పొందిన తరువాత మరింత యాక్టివ్‌గా ఉంటాము.. ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టింది శోభన. భరతనాట్యం కళాకారిణిగా తన అద్భుతమైన ప్రతిభతో పలు ప్రదర్శనలు ఇచ్చిన శోభన.. నాగార్జున విక్రమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, మోహన్ బాబుతో అల్లుడుగారు, రాజేంద్ర ప్రసాద్‌తో అప్పుల అప్పారావు లాంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. వీటితో పాటు అభినందన, రుద్రవీణ, రక్షణ తదితర చిత్రాల్లో నటించింది శోభన. తెలుగుతో పాటు.. మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పలు అవార్డుల్ని పొందింది శోభన.
By April 22, 2020 at 11:27AM
No comments