తమిళనాడులో ఘోరం.. ముగ్గురిని నరికి చంపిన దారిదోపిడీ దొంగలు
తమిళనాడులో దారి దోపిడీ ముఠాలు చేసిన ఘోరమైన నేరం వెలుగులోకి వచ్చింది. దోపిడీకి అడ్డుపడ్డారన్న కోపంతో దుండగులు ముగ్గురు యువకులను నరికి చంపి పొలంలో దహనం చేశారు. ఈ ఘటన రాణిపేట జిల్లా తిరువలంలో కలకలం రేపింది. చెన్నైకి చెందిన విజయ్‌ప్రకాశ్ గతేడాది జూన్ నెలలో తన 8 మంది గ్యాంగ్‌తో మరో గ్యాంగ్‌కు దారిదోపిడీ పోటీలు పెట్టాడు. ఈ క్రమంలోనే వారు చెన్నైకి చెందిన ఆసిఫ్, విల్లుపురం జిల్లా తేని గ్రామానికి చెందిన నవీన్, సూర్య అనే ముగ్గురి నరికి చంపేశారు. వారి మృతదేహాలను తిరువలం చెంబరాజపురం గ్రామంలోని తాటితోట వద్ద ఉన్న పొన్నై నదిలో ఖననం చేశారు. Also Read: రాణిపేట జిల్లా సిప్కాట్ హౌసింగ్ బోర్డు పంప్ హౌస్ ప్రాంతంలో ఈ నెల16వ తేదీ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను సిప్‌కాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల బారి నుంచి విజయ్‌ప్రకాశ్ తప్పించుకున్నాడు. పట్టుబడిన వారిని చిక్కరాజపురం మోట్టూరు బజన ఆలయ వీధికి చెందిన యువరాజ్ (26), పల్లవ నగర్ కన్నికోవిల్ వీధికి చెందిన వాసు (19), తిరువలం ప్రాంతానికి చెందిన అరవిందన్ (19)గా గుర్తించారు. Also Read: వీరిని విచారిస్తున్న సమయంలోనే ముగ్గురు యువకుల హత్య గురించి పోలీసులకు తెలిసింది. గత నెలలోనే వీరు మలైమేడు ప్రాంతానికి చెందిన శరవణన్ భార్య వల్లి (30)కు చెందిన రూ.లక్ష విలువైన బంగారు గొలుసు దొంగిలించినట్లు బయటపడింది. దీంతో పోలీసులు వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. Also Read:
By April 22, 2020 at 11:01AM
No comments