వరకట్నానికి నవవధువు బలి.. పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య
వరకట్న వేధింపులకు ఓ మహిళ బలైపోయింది. అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా ధాంనగర్ పీఎస్ పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ప్రతిమా షడంగి తండ్రి కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 17న దేవ్‌దీప్ పండా అనే యువకునితో ప్రతిమాకు వివాహమైంది. ముందుగా అనుకున్న ప్రకారం ఆమె తల్లిదండ్రులు కట్నకానుకలు అందించారు. Also Read: ప్రతిమా అత్తింటికి వెళ్లాక అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పగా అదనపు కట్నం ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో ఆమెకు వేధింపులు పెరగడంతో ప్రతిమా ఓ సారి భవనం పైనుంచి దూకేసింది. అయితే అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన తర్వాత ఊరి పెద్దలు జోక్యం చేసుకొని దేవ్‌దీప్ పండా కుటుంబానికి హెచ్చరిక చేయగా.. ఇకమీదట కోడలిని వేధించబోమని అత్త, మామ, దేవ్‌దీప్ వారి ఎదుట అంగీకరించారు. Also Read: ఈ క్రమంలోనే ప్రతిమా ఆదివారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యాహ్నం దేవ్‌దీప్ తన అత్తమామలకు ఫోన్ చేసి ప్రతిమా ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రిలో చేర్చామని చెప్పాడు. వారు ధాంనగర్ ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమె చనిపోయింది. దీంతో అదనపు కట్నం ఇవ్వకపోవడంతోనే తన కుమార్తెను చంపేశారని ప్రతిమా తండ్రి ఆరోపించారు. దీనిపై ఆయన ధాంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రతిమా మామను అదుపులోకి తీసుకోగా... భర్త, అత్త పరారయ్యారు. ప్రతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read:
By April 21, 2020 at 10:40AM
No comments