Breaking News

బిడ్డకు పాలిస్తుండగానే తల్లి దుర్మరణం.. ఆస్పత్రిలో హృదయ విదారక ఘటన


తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. చిన్నారికి పాలిచ్చేలోపే ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండలంలోని గంగలకుర్రు మలుపు సమీపంలో సోమవారం జరిగింది. అల్లవరం మండలం నక్కారామేశ్వరానికి చెందిన పి.వరలక్ష్మి(25) తన రెండేళ్ల పాపతో కలిసి భర్త బైక్‌పై పశ్చిమ గోదావరి జిల్లాలోని అయోధ్య లంకకు బయలుదేరారు. Also Read: గంగలకుర్రు మలుపు వద్దకు వచ్చేసరికి పాప పాల కోసం ఏడుస్తుండటంతో వరలక్ష్మి పాలు పట్టేందుకు సిద్ధమైంది. భర్త బైక్ నడుపుతుండగా ఆమె పాపకు పాలు పట్టింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి అందరూ కిందపడిపోయారు. దీంతో స్థానికులు వెంటనే 108కి కాల్ చేశారు. కాసేపటికే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వరలక్ష్మి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆమె భర్తకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. తల్లి చనిపోయిందని కూడా తెలియని పాప ఆకలితో ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By April 21, 2020 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-death-in-road-accident-while-feeding-baby-in-amalapuram/articleshow/75264425.cms

No comments