నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని మాత్రమే.. నా తదుపరి ప్రాజెక్ట్ అదే: హరీష్ శంకర్
ఇటీవలే వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' సినిమా రూపొందించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వార్తలపై స్పందించిన హరీష్.. అందులో నిజం లేదని చెప్పినప్పటికీ ఆ రూమర్స్ ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి గురించి, ఆయనతో సినిమా చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల గురించి రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ హరీష్ శంకర్. గతంలో పవన్ కళ్యాణ్‌కి 'గబ్బర్ సింగ్' రూపంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో పవన్ రీ ఎంట్రీ మొదట్లోనే హరీష్- పవన్ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు షికారు చేశాయి. ఇదే విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించిన హరీష్.. తానెప్పుడూ ఓ డైరెక్టర్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూడనని, ఓ ఫ్యాన్‌గా మాత్రమే ఆయన్ను చూస్తానని చెప్పారు. తాను చేసే ప్రాజెక్ట్ పవర్ స్టార్ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని, అది చూసి పవన్ అభిమానులకు ఆయనను మరింతగా ఆరాధిస్తారని చెప్పారు హరీష్. ప్రస్తుతం తాను ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నానని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. నిర్మాతలు మహేష్ ఎస్ కొనేరు, బన్నీ వాస్ల సహకారంతో త్వరలో సినిమాలు నిర్మించడం ప్రారంభిస్తానని అన్నారు. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఓ స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నానని చెప్పారు. దీనిబట్టి చూస్తే తన తదుపరి మూవీ పవన్‌తో కాదు మహేష్ బాబుతో ఉంటుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్. Also Read: ఇకపోతే ఈ కరోనా కల్లోల సమయంలో పేదవారికి సహాయం చేసే అదృష్టం తనకు దక్కడం ఆనందంగా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, NRI స్నేహితుల సహకారంతో పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. అయితే ఇలా చేయడం తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం కాదని ఆయన అన్నారు. తనను చూసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇలా పేదవారికి సహాయపడాలనే ఆలోచన మాత్రమే అని చెప్పారు.
By April 18, 2020 at 08:44AM
No comments