Breaking News

ఖమ్మంలో కామాంధుడు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి అత్యాచారం


దేశవ్యాప్తంగా ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతుంటే... మరోవైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె(9) ఉంది. శనివారం రాత్రి భార్యభర్తలిద్దరూ వేరే పనిమీద పక్క గ్రామానికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. Also Read: ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉండే యువకుడు(18) ఆమెపై కన్నేశాడు. ఎవరూ చూడకుండా ఆమె ఇంట్లోకి చొరబడి బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే సెల్‌ఫోన్లో ఫోటోలు తీసి ఆన్‌లైన్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక అతడు చెప్పినట్లుగా డాబాపైకి వెళ్లింది. అక్కడ బాలికను వివస్త్రను చేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా యువకుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By April 12, 2020 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/9-yr-old-girl-raped-by-neighbour-in-khammam-district/articleshow/75104555.cms

No comments